బెంగాల్ లో బీజేపీకి రెండంకెల సీట్లు కూడా రావు :- పీకే

234

పశ్చిమ బెంగాల్ ఎన్నికల నగర మోగింది. మార్చి 27న మొదటి దశ పోలింగ్ జరగనుండగా ఏప్రిల్ 29న 8 వ దశ పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రెండంకెల సీట్లను కూడా సాధించలేదని తెలిపారు. బెంగాల్ బిడ్డకే తిరిగి పట్టం కడతారని ట్విట్ చేశారు. తాను గతేడాది చేసిన ట్వీట్‌కు మే 2వ తేదీ ఓట్ల లెక్కింపు రోజు తనను బాధ్యున్ని చేసుకోవచ్చని కూడా పీకే సవాలు విసిరారు. గతేడాది డిసెంబర్‌లో ప్రశాంత్ కిశోర్.. బెంగాల్ ఎన్నికలపై ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి కనీసం రెండంకెల సీట్లు కూడా రావని పీకే అంచనా వేయడం గమనార్హం. ఈ ట్వీట్‌కు ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నట్లు తన తాజా ట్వీట్‌తో ఆయన స్పష్టం చేశారు.

 

 

 

 

బెంగాల్ లో బీజేపీకి రెండంకెల సీట్లు కూడా రావు :- పీకే