గ్రామ సచివాలయానికి కరెంట్ కట్

72

గ్రామ సచివాయలానికి విద్యత్ శాఖా అధికారులు కరెంట్ కట్ చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామసచివాలయం కరెంట్ బిల్ చెల్లించకపోవడంతో అధికారులు కరెంట్ కట్ చేశారు. దింతో ఈ క్రాఫ్ కోసం వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

కాగా తాము గతంలో బిల్ చెల్లించాలని కోరామని కానీ అధికారులు స్పందించలేదని దింతో కరెంట్ కట్ చెయ్యాల్సి వచ్చిందని విద్యుత్ అధికారులు తెలిపారు. కాగా విద్యుత్ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కరెంట్ లేకుండా ఏమీ చేయలేం అంటూ గ్రామ సచివాలయ సిబ్బంది చేతులెత్తేశారు.

దీనిపై ఉన్నతాధికారులు స్పందించి గ్రామ సచివాలయానికి కరెంట్ సరఫరా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కాగా జిల్లాలో చాలా కార్యాలయాల పరిస్థితి ఇలానే ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని సచివాలయాలు మూడు నెలలుగా బిల్ పే చేయడం లేదని అధికారులు చెబుతన్నారు.

గ్రామ సచివాలయానికి కరెంట్ కట్