Prabhas: రెబల్ స్టార్ ఇంట్లో శాంతి పూజలు?

135

Prabhas: తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది తాము నాస్తికులమని చెప్తారు కానీ దేవుడు, పూజలు పునస్కారాలు మాత్రం జరిపిస్తూనే ఉంటారు. అదేమని అడిగితే ఇంట్లో వాళ్ళ ప్రెసర్ అనేస్తారు. అందుకు మన రెబల్ స్టార్ కుటుంబం కూడా అతీతం కాదు. దేవుడిపై నమ్మకం లేదని అటు కృష్ణంరాజు, ఇటు ప్రభాస్ ఎప్పుడూ చెప్పలేదు కానీ.. మరీ హోమాలు, ప్రత్యేక పూజలు జరిపించేంత నమ్మకాలు ఉన్నాయని అభిమానులకు తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ప్రత్యేక శాంతి పూజలు జరిపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఈ మధ్యనే ముంబైలో ప్రభాస్ కొత్త సినిమా అది పురుష్ సినిమా షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సినిమా షూటింగ్ మొదలైన తొలిరోజే ఈ ప్రమాదం జరగడం అరిష్టంగా భావించిన ప్రభాస్ ఫ్యామిలీ ఆ విషయంపై పండితులను సంప్రదించినట్లుగా తెలుస్తుంది. ముహూర్త బలం పుష్య బహుళ పంచమి రోజున ఎలాంటి ముహూర్తాలు లేకపోగా ఈ సినిమా ప్రారంభోత్సవం చేసినందుకే అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయని పండితులు వెల్లడించినట్లుగా తెలుస్తుంది.

ఈ సినిమా నిర్మాణ విషయంలో మేకర్స్ మరోసారి మంచి ముహూర్తం చూసుకొని తిరిగి మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుండగా ఈలోగా ప్రభాస్ ఇంట్లో శాంతి పూజలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారట. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రత్యేకంగా ఈ పూజల నిర్వహణ జరిపిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లిపై కూడా పెద్దగా కలిసిరావడం లేదనే ఉద్దేశ్యం కూడా ఉండడంతో మొత్తంగా శాంతి హోమం నిర్వహణ చేపట్టినట్లుగా తెలుస్తుంది. మరి ఈ పూజల అనంతరమైనా ప్రభాస్ ఒక ఇంటి వాడైతే అభిమానులకు అదే పండగ!

రెబల్ స్టార్ ఇంట్లో శాంతి పూజలు?