Prabhas meet Ramagundam CP : రామగుండం సీపీని కలిసిన ప్రభాస్

151

Prabhas meet Ramagundam CP :

హీరో ప్రభాస్ రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా షూటింగ్ లో భాగంగా ప్రభాస్ రామగుండం వెళ్లారు. ఓసీపీ – 2 లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా రామగుండంకు వచ్చిన ఆయన సీపీని కలిశారు. కాసేపు ముచ్చటించారు. ప్రభాస్ సీపీ కార్యాలయానికి వచ్చారన్న విషయం తెలియడం పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు.

ప్రభాస్ ను చూసేందుకు ఎగబడ్డారు. ఇక సలార్‌ చిత్రంలో భాగంగా బొగ్గు గని ప్రాంతంలో ఫైట్‌ సీన్లను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే చిత్ర బృందం ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద సెట్టింగ్‌ వేసింది. ఓపెన్ కాస్ట్ గనిలో పదిరోజులపాటు షూటింగ్ జరగనుంది. ఇక చిత్ర బృందానికి సింగరేణి అతిథి గృహాలను కేటాయించారు. సలార్ సినిమాను హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు నిర్మాణంలో రూపొందిస్తున్నారు. మూవీకి సినిమాటోగ్రఫీ భువన్‌ గౌడ, సంగీతం రవి బస్రూర్‌ అందిస్తున్నారు.

Prabhas meet Ramagundam CP : రామగుండం సీపీని కలిసిన ప్రభాస్