శాసన మండలిలో పెరిగిన వైసీపీ సభ్యుల సంఖ్య

416

వైఎస్సార్‌సీపీ శాసన మండలి సభ్యురాలిగా పోతుల సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్నీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు, శాసనసభ డిప్యూటీ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డి తన కార్యాలయంలో ఎన్నికకు సంబంధించి ధువ్రీకరణ పత్రాన్ని పోతుల సునీతకు అందజేశారు.

శాసన సభ్యుల కోటాలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి మాత్రమే నామినేషన్ వచ్చింది. అధికార పార్టీ మినహా అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. దాంతో పోతుల సునీత ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. దీంతో శాసనమండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య 13 కు చేరింది.