విశాఖలో పోలీస్ పై దాడి అంటు వార్తలు.. స్పందించిన అధికారులు

137

విశాఖ నగరంలో పోలీస్ అధికారిపై వైసీపీ నేత చేయి చేసుకున్నట్లుగా కొని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయ కర్త విజయనిర్మల ఆధ్వర్యంలో మూడు రాజధానులు మద్దతుగా వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెలగపూడి రామకృష్ణ, రామకృష్ణబాబు కార్యాలయం ముట్టడికి యత్నించారు. అయితే ఈ సమయంలో వైసీపీ నేతలు సీఐపై దాడి చేసినట్లుగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

కాగా ఈ పోస్టులపై పోలీస్ శాఖ స్పందించింది. పోలీసులపై ఎటువంటి దాడి జరగలేదని తెలిపింది. అడ్డుకునే క్రమంలో ఓ అధికారి కిందపడ్డాడని వివరించింది. కాగా ఈ ఫోటోలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా షేర్ చేశారు. చంద్రబాబు షేర్ చెయ్యడంతో ఇవి మరింత వైరల్ అయ్యాయి

విశాఖలో పోలీస్ పై దాడి అంటు వార్తలు.. స్పందించిన అధికారులు