Hyderabad News : కరోనాతో పోలీస్ అధికారి మృతి

560

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ రాములు (50) మృతి చెందారు. ప్రస్తుతం ఈయన శిక్షణ కేంద్రంలో ఎస్ఐలకు శిక్షణ ఇస్తున్నారు. బుధవారం అస్వస్థతకు గురి కావడంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు కరోనా పాజిటివ్ గా నిర్దారించారు. రెండు రోజులు పాటు చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే ఏఎస్ఐ మృతి చెందారు.

మరోవైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కోటి మందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరణాలు కూడా వందల్లోనే ఉన్నాయి. దేశంలో సెకండ్ వేవ్ ప్రభావం కూడా తక్కువగానే ఉందని వైద్యులు చెబుతన్నారు.

Hyderabad News : కరోనాతో పోలీస్ అధికారి మృతి