కానిస్టేబుల్ గంజాయి స్మగ్లింగ్.. తెరపై సీఐ పేరు..

85

గంజాయి అక్రమ రవాణా అరికట్టాల్సిన పోలీసులే అక్రమ రవాణాకు పాల్పడరు. ఉప్పల్ నల్లచెరువు దగ్గర పోలీసులు తనిఖీ చేస్తుండగా అటుగా ఆంధ్రప్రదేశ్ నంబర్ తో పోలీస్ స్టికర్ తగిలించిన ఓ వాహనం వచ్చింది. ఆపి దాన్ని తనిఖీ చెయ్యగా అందులో రెండు కేజీల గంజాయి దొరికింది. దింతో కారులో ఉన్న వారిని పోలీసులు ప్రశ్నించారు.

అందులో మోహన్ కృష్ణా అనే వ్యక్తి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. కానిస్టేబుల్ మోహన కృష్ణతో పాటు మరో ఇద్దరిని ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా హిందూపురం టూటౌన్ లా అండ్ ఆర్డర్ సీఐ శ్రీరామ్ పేరు తెరమీదికొచ్చింది. గ‌తంలో కానిస్టేబుల్‌తో క‌లిసి సీఐ శ్రీరామ్ గంజాయి అక్రమ ర‌వాణా చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి.

కాగా ఈ వ్యవహారంపై ఉప్పల్ ఆబ్కారీ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పోలీసులు గంజాయి తరలిస్తున్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో మరికొందరు అధికారుల పేర్లు బయటకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

కానిస్టేబుల్ గంజాయి స్మగ్లింగ్.. తెరపై సీఐ పేరు..