జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

480

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష నేపథ్యంలోనే తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసేందుకు ఆయన వ్యవసాయ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. పోలీసులు జేసీ దీక్షను అడ్డుకునేందుకే వ్యవసాయ క్షేత్రానికి వచ్చినట్లు సమాచారం. కాగా రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్తున్న జేసీని పోలీసులు అడ్డుకున్నారు.

తాజగా జరిగిన జేసీ వర్సెస్ పెద్దిరెడ్డి వర్గాల ఘర్షణ విషయం జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. తనపై కేసు నమోదు చెయ్యడాన్ని ఖండిస్తూ జేసీ సోదరులు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ రోజు దీక్షకు దిగాలని భావించారు. అయితే పోలీసులు వీరి దీక్షను అడ్డుకునేలా కనిపిస్తుంది