యువరాజ్ సింగ్ పై పోలీస్ కేసు నమోదు

243

టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పై హర్యానా హిసార్ లోని హన్సి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 2020 జూన్లో ఇన్స్ స్టాగ్రామ్ లైవ్ చాటింగ్ లో ఓ వర్గానికి వ్యతిరేకంగా యువరాజ్ వ్యాఖ్యలు చేశారంటూ హిసార్కు చెందిన ఓ న్యాయవాది, దళిత హక్కుల కార్యకర్త రజత్ కల్సాన్. ఐపీసీలోని పాటు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ఈ ఇన్స్ స్టాగ్రామ్ లైవ్ చాటింగ్ లో రోహిత్ శర్మ కూడా ఉన్నారు. ఇక ఈ వ్యవహారంపై గతంలోనే యువరాజ్ సింగ్ వివరణ ఇచ్చారు.

కుల, మత, రంగు, లింగం విషయంలో నేనేలాంటి అసమానతలు చూపలేదని భావిస్తున్నాను. ప్రజల సంక్షేమం కోసం నా జీవితాన్ని గడిపాను. ఇకపై అలాగే గడుపుతాను. నేను నా స్నేహితులతో చర్చిస్తున్నప్పుడు తప్పుగా మాట్లాడాను. ఒక భారతీయుడిగా ఎవరి మనోభావాలను అయినా కించపరిచినట్లయితే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను అని యువీ క్షమాపణలు చెప్పాడు. అయితే యువరాజ్ టీమ్ఇండియా స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్లపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మేరకు పోలీసులు యువరాజ్ సింగ్ కు నోటీసులు కూడా పంపినట్లుగా సమాచారం.

యువరాజ్ సింగ్ పై పోలీస్ కేసు నమోదు