ఢిల్లీ అల్లర్లు.. పోలీసుల అదుపులో 200 మంది

149

గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన రైతుల ర్యాలీలో అల్లర్లు జరిగిన విషయం విదితమే. ఈ అల్లర్లలో చాలామందికి గాయాలయ్యాయి. ఓ రైతు కూడా మృతి చెందాడు. ట్రాక్టర్ ను వేగంగా నడుపుతున్న సమయంలో అది ఫల్టీ కొట్టి రైతు ప్రాణాలను హరించింది. మరో వైపు రైతుల ర్యాలీ గాడి తప్పింది. వెళ్లాల్సిన మార్గంలో కాకుండా ఎర్రకోటవైపు వెళ్లారు. ఎర్రకోట వద్ద అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులపై దాడి చేశారు. ఈ ప్రాంతంలో డ్యూటీలో ఉన్న సుమారు 50 మంది పోలీసులు గాయపడినట్లుగా సమాచారం.

ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే ర్యాలీలో పాల్గొన్న వారిలో 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు వీరిని విచారిస్తున్నారు. వీరి వెనుక ఎవరున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే రైతుల ర్యాలీకి పాకిస్థాన్ కు చెందిన బ్యాంకు అకౌంట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు రైతు ఉద్యమ నేతల అకౌంట్ లో పడినట్లు raw గుర్తించింది. సంబంధింత అకౌంట్స్ నిర్వహిస్తున్న వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు

రైతుల ర్యాలీ హింసకు దారి తీయడంతో భారీ నష్టం వాటిల్లింది. ర్యాలీ గాడి తప్పడంతో కేంద్ర హోంశాఖ మంగళవారం అత్యవసర భేటీ అయింది. అనంతరం పలు ఆదేశాలు జారీచేసింది హోమ్ శాఖ. ఢిల్లీ మహానగరంలోకి 15 కంపెనీల కేంద్ర బలగాలను దింపింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతులు 24 గంటల్లో వెళ్లిపోవాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వెనుదిరిగి వెళ్లకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ఈ ర్యాలీపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

ర్యాలీ శాంతియుతంగా సాగదని ఇంటెలిజెస్ అధికారులు ముందుగానే గుర్తించారు. ఈ మేరకు పోలీస్ శాఖకు పలు సూచనలు కూడా చేశారు. వారి సూచనల ఆధారంగానే పోలీసులు డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపి వీడియోలు తీశారు. ర్యాలీలో అలజడులు సృష్టించిన వారిని పట్టుకునేందుకు ఈ విషయం సహకరిస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ వీడియోస్ పరిశీలించిన తర్వాత మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక రైతులపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్ళు రైతులు కాదని రైతులు ఆ విధంగా చెయ్యరని అంటున్నారు. రైతుల పేరును చెడగొట్టేందుకు కొందరు వ్యక్తులు ఈ ర్యాలీలో చేరినట్లు అనిపిస్తుందని అనుమానిస్తున్నారు ప్రజలు

ఢిల్లీ అల్లర్లు.. పోలీసుల అదుపులో 200 మంది