రిపోర్టర్ అవతారమెత్తిన పోలీస్ అధికారి.

60

కొందరు వ్యక్తులు తాము పోలీసులమంటూ అబద్దాలు చెబుతుంటారు. పోలీస్ డ్రెస్ వేసుకొని కొందరిని బెదిరిస్తారు. కానీ ఓ పోలీస్ రిపోర్టర్ అవతారం ఎత్తి ఏకంగా ఎస్పీకి ఫోన్ చేసి లంచం తీసుకుంటున్న పోలీస్ అధికారుల లిస్ట్ మొత్తం చెప్పేశాడు.

ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ గా పనిచేస్తున్న రాజేంద్ర, చిత్తూరు జిల్లా ఎస్పీ సేథిల్ కుమార్ కు ఫోన్ చేసి తాను ఓ ప్రముఖ ఛానల్ కు చెందిన రిపోర్టర్ అని పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో ఏ అధికారి ఎంత లంచం తీసుకుంటున్నాడు. ఏ కేసులో ఎంత వసూలు చేస్తున్నారు అనే విషయాలను ఎస్పీకి చెప్పేవారు.

ఆలా రోజు ఎస్పీకి ఫోన్ చేసి అవినీతి అధికారుల పేర్లు చెప్పేవాడు.. అయితే అక్కడితో ఆగకుండా వారిపై చర్యలు తీసుకున్నారా.. లేదా? విచారణ చేస్తున్నారా? అని ప్రశ్నించే వారు.. ప్రతి రోజు ఈ విధంగా ఫోన్లు వస్తుండటంతో విసిగిపోయిన ఎస్పీ, జిల్లాలోని అందరు రిపోర్టర్స్ తో మాట్లాడారు. తామెవరు ఈ విధంగా చెయ్యలేదని తెలపడంతో, ఎస్పీ కిందిస్థాయి అధికారులకు నంబర్ పంపి సదరు వ్యక్తిని గుర్తించాలని తెలిపారు. దింతో రంగంలోకి దిగిన పోలీసులు సిగ్నల్స్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు.

అతనొక ఏఎస్ఐ అని తెలిసి షాక్ కి గురయ్యారు. ఇక దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఏఎస్ఐ రాజేంద్రను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా రాజేంద్ర సస్పెన్షన్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర చేసిన దాంట్లో తప్పేం ఉందని ప్రశ్నిస్తున్నారు.

ఇక రాజేంద్ర చేసిన పనిలో తప్పులేకపోయిన. ఎస్పీకి ఫోన్ చేసి విసిగించడం, సమయం సందర్భం లేకుండా ఫోన్ చెయ్యడం లాంటి చర్యలకు పాల్పడటంతో సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

రిపోర్టర్ అవతారమెత్తిన పోలీస్ అధికారి.