నూతన పార్లమెంట్‌కు ప్రధాని మోదీ భూమి పూజ

66
pm narendra modi, lay foundation stone,new parliament bhavan
pm modhi new parliament bhavan

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ వెంకటేశ్‌ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌ తదితరులు హాజరయ్యారు. మొత్తం 200 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నూతన పార్లమెంట్‌ భవనం నిర్మితమవుతోంది. ప్రస్తుత భవనానికి వందేళ్లు పూర్తి అయిన విషయం తెలిసిందే.