PM Narendra Modi: బంగాల్లో బీజేపీ ప్రచార శంఖారావం!

179

PM Narendra Modi: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలలో ప్రచారం మొదలు పెట్టిన బీజేపీ బెంగాల్ లో మాత్రం నేడు ప్రచార శంఖారావం పూరించనుంది. బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు శంఖారావం పూరించనున్నారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలోనే ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

శాసనసభ ఎన్నికల విషయంలో దేశవ్యాప్తంగా బెంగాల్ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. కాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రధాని బంగాల్లో తొలిసారిగా పర్యటించనుండగా బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య విమర్శల యుద్ధం హోరాహోరీగా సాగుతున్న ఈ తొలి ప్రచార సభపై అందరి దృష్టి నెలకొంది. ఈ సభను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులు భావిస్తుండగా కనీవినీ ఎరుగని రీతీలో ప్రజలు సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశాయి. మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలు సైతం ఈ ర్యాలీకి హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.