కరోనా టీకా తీసుకోనున్న మోడీ.. కేసీఆర్

150

కరోనా టీకా మొదటి డ్రైవ్ దేశంలో విజయవంతంగా కొనసాగుతుంది. దేశంలోని మూడు కోట్లమంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఈ టీకా ఇస్తున్నారు. బుధవారం నాటికీ దేశ వ్యాప్తంగా 7 లక్షల 80 వేలమందికి టీకా ఇచ్చారు. మొదటి విడత ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇస్తుండగా. రెండో విడతలో 50 ఏళ్ళు పైపడిన ప్రజా ప్రతినిధులకు టీకా ఇవ్వనున్నారు. అయితే రెండోవిడతలో ప్రధాని మోడీ తోపాటు 50 ఏళ్ళు పైబడిన ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు టీకా తీసుకోనున్నారు.

ఎమ్మెల్యేలకు కూడా టీకా ఇవ్వనున్నట్లు ప్రధాని మోడీ సీఎంల సమావేశంలో స్వయంగా చెప్పారు. రెండో దశ ప్రారంభించిన తొలిరోజే ప్రధాని మోడీ వాక్సిన్ తీసుకోనున్నారు. తర్వాత అదే రోజు మరికొంత మంది ముఖ్యమంత్రులు కూడా వాక్సిన్ తీసుకునే అవకాశం ఉంది. ఇక 50 ఏళ్ళు పైబడిన జాబితాలో దక్షిణ భారత్ నుంచి సీఎం కేసీఆర్ తోపాటు కర్ణాటక ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు 50 ఏళ్ళు లేకపోవడంతో రెండో దశలో టీకా తీసుకునే అవకాశం లేనట్లే తెలుస్తుంది. ఒక వేళ సడలింపులు చేసి ప్రజాప్రతినిధులందరికి టీకా ఇస్తే జగన్ తోపాటు మరికొందరు 50 ఏళ్ల లోపు నేతలు కూడా టీకా తీసుకుంటారు.