నష్టాల్లో ఉన్న అన్ని కంపెనీలను ప్రైవేటీకరణ చేస్తాం

164

వేటీకారణపై ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. నాలుగు సంస్థలు మినహా మిగతా వాటిని ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించారు. నష్టాల్లో ఉన్న కంపెనీలని ప్రజల పన్నులతో నడపలేమని స్పష్టం చేశారు. అయిన ప్రభుత్వం పరిపాలన చెయ్యాలి కానీ వ్యాపారం చెయ్యకూడదని వివరించారు మోడీ. నష్టాల్లో ఉన్న కంపెనీలను ప్రైవేటీకరించడమే ఉత్తమమన్నారు. ఇటువంటి సంస్థల ఆర్ధిక పరిపుష్టికోసం ఆర్ధిక సాయం అందించడం ప్రభుత్వంపై భారం అని వివరించారు. సంపద సృష్టి, ఆధునికీకరణ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మోదీ స్పష్టం చేశారు.

50-60 ఏళ్ల నాటి విధానాలు వేరని. ఇప్పటి విధానాలు వేరని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించిన నాటి పరిష్టితితులు వేరే విధంగా ఉన్నాయని తెలిపారు. నష్టాల్లో ఉన్న సంస్థలకు ప్రజాధనాన్ని కేటాయించడం వలన ఆర్ధిక భారం పెరుగుతుందని.. అదే వాటిని ప్రైవేటీకరణ చేస్తే ఆ నష్టాల్లోకి ఉన్న సంస్థలకు పెట్టె ఖర్చును సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం వైదొలిగే రంగాలను ప్రైవేటు రంగం భర్తీ చేస్తుందనన్నారాయన. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు అవసరమైన బాటలను బడ్జెట్‌ వేసిందని ఆయన తెలిపారు.

నష్టాల్లో ఉన్న అన్ని కంపెనీలను ప్రైవేటీకరణ చేస్తాం