పెద్ద మనసు చాటుకున్న ప్రధాని మోడీ.. చిన్నారికి కోసం ఆరుకోట్లు మాఫీ

207

భారత ప్రధాని నరేంద్ర మోడీ తన పెద్ద మనసు చాటుకున్నారు. ఓ ఐదు నెలల చిన్నారి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే జన్యుపరమైన లోపంతో వచ్చే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి తీరా కామత్ కి చికిత్స అందించేందుకు గాను 16 కోట్ల విలువైన మందులు దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఈ మందులకు 6 కోట్ల రూపాయలవరకు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.. ఈ పదహారు కోట్లనే విరాళాల ద్వారా సేకరించారు తల్లిదండ్రులు.. మళ్ళీ ఆరు కోట్లు జీఎస్టీ కట్టాలి అంటే చాల కష్టమైన విషయం. దింతో తల్లిదండ్రులు జీఎస్టీ మినహాయింపు కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తమ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని.

దీనికోసం అమెరికా నుంచి మందులు తెప్పించాల్సి ఉందని. దీనికి 16 కోట్లవరకు ఖర్చు అవుతుందని, తాము విరాళాల ద్వారా ఆ డబ్బును సమకూర్చుకున్నామని, కానీ జీఎస్టీ భారీగా ఉందని తెలిపారు. తమ దగ్గర మందులకు మాత్రమే డబ్బు ఉందని, దీనికి జీఎస్టీనే ఆరుకోట్ల రూపాయలు అవుతుందని,తాము చెల్లించలేమని తమ బాధను లేఖలో రాసి పంపారు. ఇక ఇదే విషయంపై మహారాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాశారు. దీంతో ప్రధాని మోడీ చొరవ చూపి జిఎస్టి రద్దు చేశారు. దీంతో పాప తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

పెద్ద మనసు చాటుకున్న ప్రధాని మోడీ.. చిన్నారికి కోసం ఆరుకోట్ల మాఫీ