అడిలైడ్ టెస్టులో పీకల్లోతు కష్టాల్లో భారత్

78

అడిలైడ్ లో జరుసుగుతున్న టెస్టు మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రెండో ఇన్నింగ్స్ భారత్ పూర్తిగా చేతులెత్తేసింది. కేవలం 26 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్ల దెబ్బకు భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ప్రస్తుతం 79 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. సాహా 2, విహారి 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కాగా తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించిన టీమిండియా.. 9/1 స్కోరుతో ఈరోజు ఆటను ఆరంభించింది. అయితే కమిన్స్‌ వేసిన తొలి ఓవర్‌లోనే 2పరుగులు చేసిన నైట్‌వాచ్‌మెన్‌ బుమ్రా పెవిలియన్ బాట పట్టారు. బుమ్రాతో మొదలైన టీమిండియా వికెట్ల పతనం 8 వరకూ కొనసాగింది. కేవలం 10 పరుగుల వ్యవధిలో 5 వికట్లు కోల్పోయింది టీమిండియా.