నారాయణ, చైతన్య కళాశాలపై హైకోర్టులో పిల్

76

నారాయణ చైతన్య కళాశాలలపై హైకోర్టులో మరోసారి పిల్ దాఖలైంది. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నాయంటూ రాజేష్ అనే వ్యక్తి పిల్ వేశారు. కాగా నారాయణ, చైతన్యకు సంబందించిన 68 కళాశాలలతో పాటు మరికొన్ని కార్పొరేట్ కళాశాలలను మూసేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కాగా గతంలో ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఎన్ని కాలేజీలను మూసివేశారో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. గత ఆర్డర్‌పై స్టే విధించాలని కార్పొరేట్‌ కాలేజీల న్యాయవాదులు కోరారు. అయితే స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.

నారాయణ, చైతన్య కళాశాలపై హైకోర్టులో పిల్