కొత్త జీవో తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం..ప్రజలు ఏమంటారో చూడాలి

93

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ వింత జీవో తీసుకొచ్చింది. కుక్కలు, పందలకు లైసెన్స్ ఉండాలని పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లైసెన్స్ లేని కుక్కలను, పందులను అధికారులు పట్టుకుంటే రూ. 500 ఫైన్ కట్టాల్సి ఉంటుందని తెలిపారు. పట్టుకున్న తర్వాత రోజుకు రూ. 250 రుసుము వాసులు చేయాలనీ జీవోలో పేర్కొన్నారు. ఇక వాటి ఓనర్లుగా ఎవరు అంగీకరించకపోతే వీధి కుక్కలుగా, వీధి పందులుగా ప్రకటించి కుటుంబ నియంత్రణ చెయ్యాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత పదిరోజుల్లోగా తిరిగి లైసెన్స్ పొందాలని తెలిపారు. అయితే గ్రామీణ ప్రాంతాలతోపాటు, పట్టన ప్రాంతాల్లో కూడా కుక్కలు పందుల సంఖ్య పెరిగిపోతుంది. కుక్కలకు యజమానులు లేకపోవడంతో వాటిని కంట్రోల్ చెయ్యడం ఇబ్బందిగా మారింది. పందులకు యజమానులు ఉన్నా వాటిని రోడ్డుపై వదిలేస్తున్నారు. వాటి వలన అనేక జబ్బులు వస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

ఇక లైసెన్స్ పొందే ముందు కుక్కలు పందుల ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది. కుక్కలకు హెల్త్ సర్టిఫికెట్, పందుల విషయంలో వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలోని కుక్కలు, పందులకు అధికారులు టోకెన్లు జారీచేస్తారు. ఆ టోకెన్లు జంతువు మేడలో నిరంతరంవ్ ఎలాడుతూ ఉండాలని తెలిపారు. ఈ మేరకు జీవో ఎంఎస్ 693లో పంచాతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలిచ్చారు.

కొత్త జీవో తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం..ప్రజలు ఏమంటారో చూడాలి