అయోధ్య రాముడిపై పిడమర్తి రవి వివాదాస్పద వ్యాఖ్యలు

249

టిఆర్ఎస్ నేతలు ఇటీవలి కాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.. మొన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వ్యాఖ్యలను సమర్థిస్తూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడికి చందాలు ఇవ్వాలంటూ బీజేపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రానున్న రోజుల్లో జై భీమ్- జై శ్రీరాం అనే నినాదాల మధ్య దేశంలో యుద్ధం జరిగే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అయోధ్య రాముడు ఏ దేశవాసో తెలియదని. నేపాల్ ప్రధాని కూడా ఇలాగే అన్నారని. రాముడు నేపాల్ లో పుట్టాడా? అయోధ్యలో పుట్టాడా? జపాన్ లో పుట్టాడో తేలాల్సి ఉంది అని వ్యాఖ్యానించారు.