పార్మసీ విద్యార్థిని మృతిలో కొత్తకోణం

257

ఘాట్ కేసర్ పార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఫిబ్రవరి 10న తనను కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులకు తెలిపిన యువతి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే విద్యార్థిని మృతి పలు అనుమానాలకు తావిస్తుంది. పోలీసులు కూడా అనుమానాస్పద మృతి కిందనే కేసు నమోదు చేసుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు తర్వాతే విద్యార్ధిని మృతిపై క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు. వారం రోజులుగా విద్యార్థిని తీవ్ర మనస్తాపంతో ఉందని, ఆహారం కూడా తీసుకోవడం లేదని తెలిసింది.

విద్యార్ధినిని 11 రోజులుగా చీకట్లో ఉంచి తల్లిదండ్రులు పూజలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థిని శరీరంలోని పేగులు, లివర్ దెబ్బతినడంతో మృతి చెందినట్లు ప్రాథమిక రిపోర్టులో తెలినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే విద్యార్థిని షుగర్ మాత్రలు వేసుకొని ఆత్మహత్య చేసుకుందంటూ మొదట భావించారు. విద్యార్థిని మృతిపై పోలీసులకు అనుమానం రావడంతో కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

పార్మసీ విద్యార్థిని మృతిలో కొత్తకోణం