అమరావతిలో లీటరు పెట్రోలు ధర చూస్తే..

158

అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో శుక్రవారం భారత్ లోని ఆయిల్ కంపెనీలు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 25 పైసలు చొప్పున చమురు సంస్థలు పెంచాయి. దీంతో ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.45 కాగా.. లీటర్‌ డీజిల్‌ ధర 75,63 కు చేరింది.

అమరావతి పెట్రోలు ధర లీటరుకు రూ. 91.68, డీజిల్‌ ధర రూ.84.84.
హైదరాబాద్‌లో పెట్రోలు ధర లీటరుకు రూ. 88.89, డీజిల్‌ ధర రూ.82.53
ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 92.04 డీజిల్‌ ధర రూ. 82.40
చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 88.07 డీజిల్‌ ధర రూ.80.90
కోలకతాలో పెట్రోలు ధర లీటరుకు రూ. 86.87 డీజిల్‌ ధర రూ.79.23