Petrol Price : నేపాల్ కు క్యూ కడుతున్న యూపీ, బీహార్ వాసులు

254

దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. 93 రూపాయలు దాటి 95 రూపాయల వైపు పరుగులు పెడుతున్నాయి పెట్రోల్ రేట్లు. ఇక ఈ నేపథ్యంలోనే నేపాల్ సరిహద్దు జిల్లాల ప్రజలు నేపాల్ వెళ్లి పెట్రోల్ తెచ్చుకుంటున్నారు. అయితే బైక్ లో పెట్రోల్ ఫిల్ చేసుకుంటే నేరం కాదు.. లీటర్లకు లీటర్లు డ్రమ్ముల్లో తెచ్చుకుంటే మాత్రం నేరం కిందనే పరిగణిస్తారు.

ఇక దేశంలో పెట్రోల్ ధరలు అధికంగా ఉండటంతో సరిహద్దు గ్రామాల ప్రజలు నేపాల్ బాట పట్టారు. భారత్ తో పోల్చుకుంటే నేపాల్ లో లీటర్ కు 22 రూపాయలు తక్కువగా ఉంది. నేపాల్ లో లీటర్ పెట్రోల్ 70 రూపాయలు మాత్రమే.. ఇక అక్కడ మన కరెన్సీని కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. దింతో సరిహద్దు గ్రామాల ప్రజలు నేపాల్ సరిహద్దుల్లోని పెట్రోల్ బంక్ లకు వెళ్తున్నారు.

యూపీలోని గోరఖ్ పూర్, లఖీమ్‌పూర్ ఖీరీ, పీలీభీత్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు నేపాల్ నుంచి వాహనాల ద్వారా డ్రమ్ములతో పెట్రోల్, డీజిల్‌ను ఇక్కడికి తరలిస్తున్నారు. బీహార్‌లోని అర్‌రియాలో పెట్రోలు ధర రూ. 93.50 రూపాయలుగా ఉండగా, నేపాల్‌లో లీటరు పెట్రోలు ధర రూ.70.62గా ఉంది. ఇదేవిధంగా మన దేశంతో పోలిస్తే నేపాల్‌లో డీజిల్ ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి.

దింతో అక్కడ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు కొందరు దళారులు. అయితే దళారుల దగ్గర పెట్రోల్ తక్కువ ధరకు లభిస్తుండటంతో ప్రజలు వారి ఇళ్లకు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే సరిహద్దుల నుంచి పెట్రోల్ తరలిస్తూన్న వారిని సరిహద్దు భద్రతా దళం, పోలీసులు పట్టుకుంటున్నారు. వీరిపై కేసులు నమోదు చేస్తున్నారు. పెట్రోల్ తరలించడం అక్రమమని పోలీసులు చెబుతున్నారు. అయినా కూడా ప్రజలు మాత్రం దొంగ మార్గాల్లో వెళ్తూ పెట్రోల్ పట్టుకొస్తున్నారు.

Petrol Price : నేపాల్ కు క్యూ కడుతున్న యూపీ, బీహార్ వాసులు