బండి బయటకు తియ్యాలంటే భయపడుతున్నారు

159

వాహనాలు బయటకు తియ్యాలంటేనే భయపడుతున్నారు ప్రజలు.. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటంతో మైలేజి వచ్చే వాహనాలపై కన్నేశారు. ఇక కొందరైతే బండ్లు బయటకు తియ్యడమే మానేస్తున్నారు. కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఇద్దరు, ముగ్గురు కలిసి ఒకే వాహనంలో వెళ్లిపోతున్నారు. మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు కుదేలవుతున్నారు.. తక్కువ జీతం వచ్చే వారు బైక్ లను నడపలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో లో క్రూడ్ ధర పెద్దగా లేనప్పటికీ దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి.

ఇక గురువారం వరుసగా 10 వరోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇలానే పెంచుకుంటూ పొతే మరో ఆరు నెలల్లో పెట్రోల్ రేట్ రూ.150 కి చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాగా గురువారం లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 34 పైసల వరకూ పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో ఢిల్లీలో ధర రూ.90కి చేరువైంది. ప్రస్తుతం పెట్రోల్‌ లీటర్‌ రూ.89.88కు చేరింది. రికార్డు స్థాయిలో డీజిల్‌ సైతం రూ.80ని దాటింది. గురువారం 34 పైసలు పెరిగి లీటర్‌కు రూ.80.27కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.96.32కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ ఈ రోజు లీటరుకు రూ.91.11, చెన్నైలో రూ .91.98కు చేరింది. అలాగే హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర రూ.93.45, డీజిల్‌ రూ.87.55కు చేరింది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లో శ్రీగంగనగర్‌లో లీటర్‌కు రూ.100కిపైగా చేరింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 95 చేరువలో ఉంది.

బండి బయటకు తియ్యాలంటే భయపడుతున్నారు