మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

175

పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం మరోసారి పెరిగాయి.. పెట్రోల్ రేటు 30 పైసలు, డీజిల్ ధర 39 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో ధరలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీలో ఇప్పుడు లీటరుకు రూ .88.14, డీజిల్ రూ .78.38 గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.91.65కు, డీజిల్ ధర రూ.85.50కు చేరాయి. అలాగే విజయవాడలో పెట్రోల్ రూ.93.90కు చేరింది. డీజిల్ ధర 37 పైసలు పెరుగుదలతో రూ.87.27కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.94.64కు చేరింది. డీజిల్ ధర రూ.85.32కు చేరింది. కాగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గాయి.. బ్యారెల్ మార్కుకు 61 డాలర్లకు దగ్గరగా ఉంది.