పెద్దపల్లి న్యాయవాద దంపతుల హత్యకేసులో ముగ్గురు అరెస్ట్

442

బుధవారం పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యకేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజీ నాగిరెడ్డి హత్యకేసును సంబందించిన వివరాలు వెల్లడించారు. గురువారం ఉదయం మహారాష్ట్ర సరిహద్దులో నిందితులు కుంట శ్రీను, శివందుల చిరంజీవిని, ఆ తర్వాత వారికి సహకరించిన అక్కపాక కుమార్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో 24 గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. కాగా కుంటశ్రీను, హత్యకు వామన్ రావు ఒకే గ్రామానికి చెందిన వారు.

అయితే వీరిమధ్య చాలా రోజులుగా వివాదం కొనసాగుతుంది. న్యాయపరంగా శ్రీనుని వామన్ రావు గట్టిగ ఎదుర్కొంటున్నారు. దింతో శ్రీను వీరిని అంతం చెయ్యాలని గత కొంత కాలంగా భావిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. వామన్ రావును న్యాయపరంగా ఎదురుకోలేకనే హత్య చేసినట్లు తెలిపారు. విచారణలో శ్రీను ఎక్కడా రాజకీయ కారణాలు చెప్పలేదని, శ్రీను, చిరంజీవి కలిసి హత్య చేశారని అన్నారు. కాగా గతంలో శ్రీనుపై పలు కేసులు ఉన్నాయి. అయన జైలు శిక్ష కూడా అనుభవించినట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో ఏ1గా ప్రధాన నిందితుడు కుంట శ్రీను, ఏ2 శివందుల చిరంజీవి, ఏ3గా అక్కపాక కుమార్‌ను చేర్చామని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఇక వీరిని ఈ రోజు కోర్టుకు హాజరు పరచనున్నారు.

పెద్దపల్లి న్యాయవాద దంపతుల హత్యకేసులో ముగ్గురు అరెస్ట్