డోకిపర్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పవన్

114

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. గుడివాడ నియోజకవరంలో గల డోకిపర్రి గ్రామంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన పవన్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా డోకిపర్రి వెళ్లారు. పవన్ కల్యాణ్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెళ్లారు. కాగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించారు.

దేవాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్ కు ఆలయ అర్చుకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో కలిగదిరిగిన పవన్ కల్యాణ్. అనంతరం వెంకన్నకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎయిర్ పోర్ట్ నుంచి డోకిపర్రి వరకు ఆయనతో కలిసి ర్యాలీగా వెళ్లారు.

 

డోకిపర్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పవన్