పవన్ కళ్యాణ్ కొత్త టైటిల్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’?

274

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు వరస సినిమాలను క్యూలో పెట్టాడు. ప్రస్తుతం పవన్ నటించిన వకీల్ సాబ్ విడుదలకు సిద్ధంగా ఉండగా మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వాటిలో ఒకటి సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుండగా మరొకరి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు. ప‌వ‌న్ 27వ చిత్రంగా మొద‌లైన ఈ పీరియాడిక‌ల్ మూవీకి ‘విరూపాక్ష’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని ఆ మధ్య ప్రచారం గట్టిగానే వినిపించింది.

అయితే.. తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అనే మ‌రో టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేస్తోన్న తొలి పీరియాడిక‌ల్ మూవీ ఇదే కాగా.. ఇందులో ప‌వ‌న్ బందిపోటు పాత్ర‌లో కనిపించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ సరసన ఇద్ద‌రు హీరోయిన్స్ నటించనుండగా ఒక‌రు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. మ‌రో హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ ను దాదాపుగా ఖరారు చేశారు.

పవన్ కళ్యాణ్ కొత్త టైటిల్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’?