పవన్ నజర్.. పవర్ ప్యాక్ మేకింగ్ టీజర్!

183

తమ హీరో కొత్త సినిమా అప్డేట్ అంటే తెగ ఆరాటపడే తెలుగు సినీ అభిమానులు కరోనా ప్రభావంతో ఈ మధ్య సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను చూసుకొని మురిసిపోయారు. అయితే, ఇప్పుడు రోజులు మారాయి. సినిమాకు మంచి రోజులు వస్తున్నాయి. అందుకే ఇన్నాళ్లు వెనకాముందు అనుకుంటున్నా మేకర్స్ ఇప్పుడు వారి సినిమాలకు సంబంధించి కొత్త అప్డేట్స్ రిలీజ్ చేసి మళ్ళీ తమ తమ సినిమాలపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

ఇప్పటికే నిన్న జక్కన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రిలీజ్ డేట్, ఒక పోస్టర్ విడుదల కాగా ఈరోజు పవన్ కొత్త సినిమాకు సంబంధించి మేకింగ్ టీజర్ ఒకటి విడుదల చేశారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించడంతో పాటు పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నాడు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైందని తెలిపేలా యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో పవన్ బుల్లెట్ బైక్ మీద ఓ లాడ్జిలో ఎంటర్ అవడం చూపించగా ఇది షూటింగ్ లోకి పవన్ ఎంటర్ అయ్యారని ఇంటర్నల్ మీనింగ్ వచ్చేలా కట్ చేశారు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోలో హైలెట్ గా నిలవగా పవన్ అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

పవన్ నజర్.. పవర్ ప్యాక్ మేకింగ్ టీజర్!