జనసేన ఎమ్మెల్యే ఉన్నాడో లేడో తెలియదు – పవన్ కళ్యాణ్

1147

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో నివర్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పవన్ పరామర్శించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ప్రతి ఎకరాకు 35 వేల రూపాయాల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇవ్వకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులతో అసెంబ్లీకి వస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు పవన్.

ఇక కొడాలి నానిపై విమర్శలు గుప్పించారు. నాని సీఎంకి చిడతలు వాయించడంకొట్టడం మాని రైతులను ఆదుకోవాలని తెలిపారు. నాని నన్ను తిట్టడం వలన వచ్చేది ఏమి లేదని, ముందు రైతుల సమస్యలపై దృష్టిపెట్టాలని కోరారు. రాష్ట్రంలో జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడని, అతడు తమ పార్టీలో ఉన్నాడో లేదో తెలియదని అన్నారు.

వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉన్నాడో లేడో తెలియని జనసేనను చూసి భయపడుతున్నారు. మాట్లాడితే సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నా అంటున్నారు. జగన్‌కు ఏ వ్యాపారాలు లేవా, కేవలం రాజకీయాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. సీఎం సాబ్‌ తక్షణమే పదివేల రూపాయలు విడుదల చేయండి. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు 35వేల రూపాయలు విడుదల చేయకపోతే రైతులు, నిరుద్యోగులు అందరూ అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు

జనసేన ఎమ్మెల్యే ఉన్నాడో లేడో తెలియదు – పవన్ కళ్యాణ్