రామమందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భారీ విరాళం

348

అయోధ్య రామయ్య మందిరానికి ప్రముఖులు భారీగా విరాళాలు సమర్పిస్తున్నారు. శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేవాలయ నిర్మాణానికి విరాళాలం అందించారు. రూ. 30 లక్షల రూపాయలను తన తరపున విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయోధ్య రామమందిరం దేశ ప్రజల చిరకాల స్వప్నమని అన్నారు పవన్.

ఇక ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో నిర్మితమవుతున్న రామమందిరానికి 200 కోట్లకు పైనే విరాళాలు వచ్చాయి. మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇలా అందరు ప్రజాప్రతినిధులు తమకు తోచినంత సాయం చేస్తున్నారు. దేశ ప్రజల చిరకాల వాంఛగా ఉన్న రామయ్య మందిర నిర్మాణానికి తలో చెయ్యి వేస్తున్నారు.

ఇక ఇప్పటీకే రాష్ట్రపతి రామనాథ్ కోవిద్ తోపాటు, బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమారు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మరికొందరు భారీగా విరాళాలు సమర్పించారు.

రామమందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భారీ విరాళం