పవన్ ఓ బోడిలింగం.. ప్రజలు అందుకే ఇంటికి పంపారు – నాని

1358

జనసేన అధినేతపై మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ బోడిలింగం కాబట్టే రెండు చోట్ల ఓడగొట్టి ఇంటికి పంపారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి శివలింగం కాబట్టే సీఎం సీటులో కూర్చోబెట్టారని వివరించారు. తాను ఒక మంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఎమ్మెల్యేగా గుడివాడ ప్రజలకు సమాధానం చెబుతానని, నటులకు ప్యాకేజీ స్టార్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.

పేకాట క్లబ్స్ నడిపిస్తున్నానని పవన్ కళ్యాణ్ అనడం విడ్డురంగా ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్ లను మూసేశామని తెలిపారు. టీడీపీ హయాంలో క్లబ్స్ పెట్టి పేకాట ఆడించారని అప్పుడు అడ్డుకోకుండా ఇప్పుడు పేకాట ప్రస్తావన తేవడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు సొంతపుత్రుడు, దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రాష్ట్రంలో పర్యటిస్తున్నారని, ఒకరు ప్రకాశం వైపు పర్యటిస్తుంటే మరొకరు ఇక్కడ పర్యటిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్యాకేజ్ తీసుకోని మాట్లాడటం తనకు రాదని కొడాలి అన్నారు. సినిమాలు మానేయాలని పవన్ కు ఎవరు చెప్పలేదని, అతడిని ఇప్పటికి తాము ఒక యాక్టర్ గానే చూస్తామని అన్నారు. పనికిమాలిన మాటలు, ప్యాకేజ్ మాటలు ఆపివేయాలని సూచించారు నాని.

పవన్ ఓ బోడిలింగం.. ప్రజలు అందుకే ఇంటికి పంపారు – నాని