అద్భుతః: బ్రెయిన్ సర్జరీలో భగవద్గీత శ్లోకాలు

94

భగవత్ గీత, చాలామంది ఇది ఒక మోటివేషనల్ గ్రంథం అని చెబుతుంటారు. దీనిని చదివితే మనిషికి జ్ఞానం వృద్ధి చెందుతుందని అంటుంటారు. అయితే ఓ పేషంట్ తనకు ఆపరేషన్ చేస్తుండగా భగవత్ గీత శ్లోకాలను వల్లెవేశారు. గుజరాత్ లోని సూరత్ కు చెందిన దయబెన్ అనే 36 ఏళ్ల మహిళకు మెదడులో కణితి ఏర్పడింది. దానిని తొలగించేందుకు డాక్టర్లు ఓపెన్ బ్రెయిన్ సర్జరీ చెయ్యాలని తెలిపారు.

ఈమేరకు సర్జరీ ఏర్పాట్లు చేసారు. అయితే దయబెన్ శరీరం మొత్తానికి అనేస్తేషియా ఇవ్వకుండా కేవలం ఆపరేషన్ చేసే ప్రాంతంలోనే అనేస్తేషియా ఇచ్చారు. అనంతరం ఆపరేషన్ మొదలు పెట్టారు. వైద్యులు ఆపరేషన్ మొదలు పెట్టగానే ఆమె భగవద్గీత శ్లోకాలు జంపించడం మొదలు పెట్టింది. అత్యంత సున్నితమైన ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఆమె శ్లోకాలు జపించడం డాక్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిని కొందరు వీడియో తీశారు.

ఇక ఆపరేషన్ అనంతరం డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ తన సర్వీసులో ఇటువంటివి ఎప్పుడు చూడలేదని తెలిపారు. తాను 9 వేల సర్జరీలు చేసి ఉంటానని, పేషంట్లు చాలావరకు నోరు మెదపకుండా ఉంటారని తెలిపారు. కానీ దయబెన్ మాత్రం ఆపకుండా భగవత్ గీత శ్లోకాలను వల్లెవేసినట్లు వివరించారు. ఆమె ఆలా చదవడం తమకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చినట్లు తెలిపారు.

అద్భుతః: బ్రెయిన్ సర్జరీలో భగవద్గీత శ్లోకాలు