పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లేనట్లే

68

కరోనా మహమ్మారి ప్రభావం పార్లమెంట్ సమావేశాలపై పడింది. దింతో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేలా లేరు. దీనిపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్ని పార్టీలతో చర్చించనున్నారు. చర్చ అనంతరం పార్లమెంట్ సమావేశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. శీతాకాల సమావేశాలను నిలిపివేసి జనవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుముఖం పడుతుంది. మంగళవారం 22,065 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 99,06,165 మందికి కరోనా సోకింది. 94,22,636 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లారు. కరోనాతో ఇప్పటివరకు 1,43,709 మృతి చెందారు. గత 24 గంటల్లో 354 మంది మృతి చెందారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు లేనట్లే