కొడుక్కి తండ్రి పేరు పెట్టుకున్న పరిటాల శ్రీరామ్

238

పరిటాల రవీంద్ర, అనంతపురం రాజకీయాల్లో ఓ ఉప్పెన. రాజకీయాల్లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే మంచి పేరు సంపాదించుకొని ప్రజల నోళ్ళలో నానారు. ఇక ఆయనను తిట్టేవారు కూడా ఉన్నారు. మంచి ఉన్న దగ్గర చేదు కూడా సహజంగానే ఉంటుంది. అయితే పరిటాల రవీంద్ర పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ – జీవ దంపతులు గతేడాది నవంబర్ 6 న మగబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డకు ఈ రోజు నామకరణం చెయ్యడం జరిగింది.

వేద పండితులు నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నేతల మధ్య పరిటాల శ్రీరామ్ కుమారుడికి నామకరణం చేశారు. ఈ సందర్బంగా వేదపండితులు బాబుకు ఏం పేరు పెట్టాలని అడగ్గా అక్కడ ఉన్నవారు పరిటాల రవీంద్ర అంటూ గట్టిగ మొత్తుకున్నారు. దింతో ఆ ప్రాంతమంతా పరిటాల రవీంద్ర నినాదాలతో మారుమోగింది. ఇక శ్రీరామ్ కూడా వేదపండితులకు ఇదే పేరు చెప్పారు. తండ్రి పేరు చెబుతున్న సమయంలో శ్రీరామ్ భావోద్వేగానికి గురయ్యారు.

ఇక 2019లో ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్, టీడీపీ కంచుకోటైన రాప్తాడు నుంచి పోటీ చేశారు. అందరు శ్రీరామ్ గెలుస్తారని అనుకున్నారు. కానీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో శ్రీరామ్ ఓటమి చవిచూశారు. ఇక ప్రస్తుతం నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు శ్రీరామ్. ఇక 2023లో జరిగియే సార్వత్రిక ఎన్నికల్లో శ్రీరామ్, సునీత ఇద్దరు పోటీ చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నా సమాచారం.

ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉన్న ఇప్పటి నుంచే ఎత్తుగడలను సిద్ధం చేస్తున్నారు. శ్రీరామ్ రాప్తాడు నుంచి పోటీ చేస్తే, సునీత ధర్మవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ధర్మవరం ఎమ్మెల్యేగా కేతిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో గతంలో టీడీపీ ఎదురులేని శక్తిగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఈ ప్రాంతాల్లో వైసీపీ రాజ్యమేలుతుంది.

కొడుక్కి తండ్రి పేరు పెట్టుకున్న పరిటాల శ్రీరామ్