అప్పు కట్టలేక మగబిడ్డను అమ్ముకున్న దంపతులు

172

దేశం రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నా.. టెక్నాలజీలో పరుగులు పెడుతున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో ఎక్కడో ఓ దగ్గర పిల్లలను అమ్ముకునే తల్లులు బయటపడుతూనే ఉన్నారు. గతంలో మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిడ్డలను అమ్ముకున్న తల్లులను చూసాం. బిడ్డలని పోషించలేని దీన పరిస్థితిలో ఉన్న చాలా మంది బిడ్డలను అమ్మేశారు. వీరి కథలను సినిమాల్లో కూడా చూపించారు. అయితే అప్పులు తీర్చేందుకు ఓ మహిళ తన బిడ్డను అప్పు ఇచ్చిన వారికీ ఇచ్చేసింది.

ఈ హృదయ విదారక ఘటన కర్ణాటకలో జరిగింది. అప్పులు తీర్చండి… లేదంటే బిడ్డను అమ్మండి అంటూ..వీుటర్‌ వడ్డీ దారులు హుకుం జారీ చేశారు. గత్యంతరం లేక పేద దంపతులు తమ ఐదు నెలల మగ బిడ్డను వారి చేతిలో పెట్టారు. బిడ్డపై మమకారంతో మనసు మార్చుకొని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి బాలుడిని రక్షించి చిన్నారిని కొనుగోలు చేసిన నిందితులను అరెస్ట్‌ చేశారు. కర్ణాటకల హుబ్లీలోని విద్యాగిరిలో రూప, మైనుద్దీన్‌ దంపతులు నివాసం ఉంటున్నారు.

వీరు ఇంటి నిర్మాణం కోసం మీటర్‌ వడ్డీదారుల వద్ద అప్పులు చేశారు. బాకీ తీర్చలేని పరిస్థితి. అప్పులు తీర్చకపోతే బిడ్డను అమ్మాలని ఒత్తిడి చేశారు. దీంతో తమ ఐదు నెలల మగబిడ్డను రూ. 2.50లక్షలకు విక్రయించారు. బిడ్డ దూరం కావడంతో మనో వేదనకు గురైన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలసులు గాలింపు చేపట్టి భారతీ మంజునాథ వాల్మీకి(48), రమేష్‌ మంజునాథ్‌(48), రవి బీమసేనా హేగ్డే(38), వినాయక అర్జున మాదర(27), ఉడుపికి చెందిన విజయ్‌ బసప్ప నెగళూరు(41), చిత్ర విజయ్‌ నెగళూరును అరెస్ట్‌ చేశారు.

వారినుంచి బిడ్డను స్వాధీనం చేసుకొని బాలల సంక్షేమ సమితికి అప్పగించారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. అయితే ఎటువంటి ఘటనలు కర్ణాటకలో గతంలో కూడా జరిగాయి. కానీ లోలోపలనే సెటిల్మెంట్ జరిగిపోయింది. ఇక తాజాగా జరిగిన ఘటన పోలీసులు దృష్టికి రావడంతో బయటపడింది.

అప్పు కట్టలేక మగబిడ్డను అమ్ముకున్న దంపతులు