పరకాల బంద్.. కొనసాగుతున్న ఉద్రిక్తత!

154

వరంగల్ రూరల్ జిల్లాలో అధికార-ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు సహనం కోల్పోయారు. దాని పర్యవసానంతో ఇప్పుడు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రామజన్మభూమి పేరిట విరాళాలు వసూలు చేస్తున్నారని పరకాల నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆరోపణపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం హన్మకొండలోని ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు అదుపుచేశారు.

ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. అప్పుడే ఇరు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా దాడిని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ సోమవారం పరకాల బందుకు పిలుపునిచ్చింది. దీంతో సోమవారం ఉదయం నుండే టీఆర్ఎస్ కార్యకర్తలు వాహనాలపై తిరుగుతూ దుకాణాలను మూయిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ, స్థానిక వ్యాపార సంస్థలు బందులో పాల్గొటుండగా ఆర్టీసీ సర్వీసులు సైతం నిలిపివేశారు. నిరసనకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని టీఆర్ఎస్ కోరగా.. పోలీసులు భారీ స్థాయిలో మోహరించి ఘర్షణలు జరగకుండా చూస్తున్నారు.

పరకాల బంద్.. కొనసాగుతున్న ఉద్రిక్తత!