Digital budget: దేశ చ‌రిత్ర‌లో తొలిసారి పేప‌ర్‌లెస్‌ బడ్జెట్..!

87

Digital budget: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్ 2021-22ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈసారి బడ్జెట్ ను పేపర్ విధానంలో కాకుండా ఎలక్ట్రానిక్ ట్యాబ్ లో పొందుపరిచారు. దేశ చ‌రిత్ర‌లో తొలిసారిగా కేంద్ర బడ్జెట్ పేప‌ర్‌లెస్‌గా మారగా.. ఎర్ర‌టి బ్యాగులో ఐప్యాడ్ ట్యాబ్లెట్‌తో మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ క‌నిపించారు. అది కూడా మేడిన్ ఇండియా ట్యాబ్‌లో నిర్మ‌ల బ‌డ్జెట్‌ పార్లమెంటుకు తెచ్చారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో బడ్జెట్ డాక్యుమెంట్లను ప్రింట్ చేయకూడదని నిర్మలా సీతారామన్ నిర్ణయించగా.. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకంగా నిలవబోతుంది.

బడ్జెట్ పేపర్లను ఈసారి ప్రింట్ చేయలేదు. ఎకనమిక్ సర్వే మాదిరి బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను కూడా ట్యాబ్‌‌‌‌‌‌‌‌లో తీసుకొచ్చారు. సాధారణంగా బడ్జెట్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంట్ల ప్రింటింగ్ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసే అధికారులందర్ని ఎంతో సీక్రెసీగా ఉంచుతారు. వారికి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. కనీసం ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడరు. కేవలం హై ర్యాంక్ అధికారులకు మాత్రమే కొంత యాక్సస్ ఉంటుంది. అయితే ఈ సారి పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌గా రావడంతో.. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఎలాంటి లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ లేదు. పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో సీక్రెసీ ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్ ఏమీ జరుగలేదు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌‌‌‌‌‌‌‌ విధానంలో ఎన్నో మార్పులు రాగా.. సంప్రదాయబద్ధంగా బడ్జెట్ పేపర్లను బ్రీఫ్‌‌‌‌‌‌‌‌కేసులో పట్టుకురావడాన్ని నిర్మలా సీతారమన్ పక్కన పెట్టి.. గత సంవత్సరం ఎర్రటి రంగు వస్త్రంలో లెడ్జెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పట్టుకుని వచ్చారు. అలాగే బడ్జెట్ తేదీలు కూడా ఫిబ్రవరి 1కి మారాయి. అంటే ఒక నెల ముందుకు జరిగాయి. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతేడాది బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ఏదో ఒక చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంటూ దేశ ప్రజలను ఆకర్షిస్తోంది. హల్వా మాదిరి ఈ సారి బడ్జెట్‌‌‌‌‌‌‌‌ స్వీట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందో.. లేదో ఇక చూడాల్సి ఉంది.