సీఎంని చంపితే 10 లక్షల డాలర్లు ఇస్తాం.

86

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ను చంపిన వారికి పది లక్షల డాలర్లు ఇస్తామని గుర్తు తెలియని వ్యక్తులు మొహాలీ వీధుల్లో పోస్టర్లు అంటించారు. ఈ పోస్టర్లు ఎవరు అంటించారు అనే విషయం తెలియరాలేదు. ఇక గుర్తుతెలియని నిందితులపై ఐపీసీ సెక్షన్ 504, 506, 120బీ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. పంజాబ్ డిఫేస్‌మెంట్ ప్రాపర్టీ ఆర్డినెన్స్ యాక్ట్ 1997లోని 3,4,5 సెక్షన్ల కింద కూడా కేసు ఫైల్ చేశారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయతిస్తున్నారు. సమీపంలోని సీసీటీవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేశారా? లేదంటే హత్యకు ఎవరైనా కుట్ర పన్నారా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే గత కొంత కాలంగా పంజాబ్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు రైతులు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారు. 1500 లకు పైగా సెల్ ఫోన్ సిగ్నల్ టవర్లను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే సి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ ఆస్తులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించమని కేసులు పెట్టి జైల్లో వేస్తామని తెలిపారు. సీఎం మాట్లాడిన 48 గంటల్లో ఈ విధంగా పోస్టర్లు వెలువడటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.