ఏపీ పంచాయితీ ఎన్నికల తేదీల్లో మార్పు :- ఎస్ఈసీ

247

పంచాయితీ ఎన్నికలపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తాము తప్పుబట్టలేమని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టేసింది సుప్రీం కోర్టు. దింతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఇక ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం షెడ్యూల్ మార్చుతూ నిర్ణయం తీసుకుంది. నామినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు సిద్ధం కాకపోవడంతో రెండవ విడతను మొదటివిడతగా మార్చింది ఎన్నికల సంఘం. దింతో ఫిబ్రవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఇక ఎన్నికలు ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో జరగనున్నాయి. మొదటి విడతలో 11 జిల్లాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. విజయనగరం, ప్రకాశం జిల్లాలను మొదటి విడత జాబితాలో చేర్చలేదు.

 

ఏపీ పంచాయితీ ఎన్నికల తేదీల్లో మార్పు