12 పంచాయితీలు, 372 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్

247

ఆంధ్రప్రదేశ్ లో వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోయిన 12 గ్రామాలు, 372 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. మార్చి 4వ తేదీ నాటికి ఓటర్ల జాబితా విడుదల చేయనుంది. 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించింది. 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 8వ తేదీ సా.5 గంటల వరకు నామినేష‌న్లపై ఫిర్యాదులు స్వీకరిస్తారు. 9వ తేదీ నామినేషన్లపై వచ్చిన అప్పీల్ పరిశీలించి 10 వ తేదీ మ.3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు సాయంత్రం 4 గంటలకి అభ్యర్ధుల తుది జాబితా విడుదల చేస్తారు. 15వ తేదీ ఉ.6.30 నుంచి మ.3.30 గంటల వరకు పోలింగ్.. సాయంత్ర 4 గంటలనుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

12 పంచాయితీలు, 372 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్