పంచాయితీ ఎన్నికల్లో విజయం సాధించిన హిజ్రా

250

మజరాష్ట్రలోని జలగావ్ జిల్లా భడ్లీ భూదృక్ గ్రామంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పంచాయితీ సభ్యురాలిగా ఓ హిజ్రా గెలుపొందారు. జనవరి 15 న ఎన్నికలు జరగ్గా సోమవారం ఫలితాలు వెల్లడించారు. ఈ ఫలితాల్లో అంజలి అనే హిజ్రా విజయం సాధించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి తనను పోటీలో ఉంచిన పెద్దలకు, తనకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాలోకి వచ్చానని చెప్పారు అంజలి. ప్రజా సేవకు జీవితాన్ని అంకితమిస్తానని అంజలి తెలిపారు.

పంచాయితీ ఎన్నికల్లో విజయం సాధించిన హిజ్రా