పంచాయితీ ఎన్నికల పూర్తి ఫలితాలు ఇవే

341

కోర్టుకేసులు, విమర్శలు ప్రతివిమర్శలు మధ్య మొదలైన పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికలను వాయిదా వేయించేందుకు, ఎన్నికలను జరిపించేందుకు ఎన్నికల కమిషనర్ ఇద్దరు కలిసి పంచాయితీ ఎన్నికల్లో పెద్ద పంచాయతీ పెట్టారు. ఎట్టకేలకు ఎస్ఈసికి అనుకూలంగా తీర్పు రావడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, చివరికి పంచాయితీ ఎన్నికలు పూర్తయ్యాయి.

ఇక ఈ ఎన్నికల్లో విజయాలపై ఒక్కో పార్టీ ఒక్కో విధంగా చెబుతుంది. అధికార పార్టీ అయితే ప్రజాస్వామ్యం నెగ్గిందని.. అన్ని ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కనిపించదని అంటోంది. విపక్షాలు మాత్రం అరాచకాలతో ఫలితాలు సాధించారని.. ప్రతిపక్షాలు నెగ్గిన చోట కూడా.. వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేలా అధికారులను బెదిరించారంటూ ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా అధికార పార్టీ 80కిపైగా స్థానాల్లో విజయం సాధించింది. ఇతర పార్టీలు ఫ్యాన్ గాలికి చతికిల పడ్డాయి. టీడీపీ కొద్దిగా పోరాడినట్లు కనిపించినా పెద్దగా విజయాలు అందుకోలేకపోయింది. జనసేన ఊహించిన దానికంటే ఎక్కువ పంచాయితీల్లో విజయం సాధించింది. బీజేపీ కూడా నెట్టుకొచ్చింది.

నాలుగు విడతల్లో మొత్తం తుది ఫలితాలు ఇవే:

వైసీపీ మద్దతుదారులు 10,299

టీడీపీ మద్దతుదారులు 2,166

జనసేన మద్దతుదారులు 157

బీజేపీమద్దతుదారులు 45

ఇతరులు 414

టీడీపీ ఒకటి రెండు జిల్లాలో మిహన మిగతా చోట్ల పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన గట్టి పోటీ ఇచ్చింది. పలు గ్రామాల్లో అన్ని వార్డులను కైవసం చేసుకుంది జనసేన.

పంచాయితీ ఎన్నికల పూర్తి ఫలితాలు ఇవే