పంచాయితీ ఎన్నికల్లో బోణి కొట్టిన కాంగ్రెస్

124

ఆంధ్ర ప్రదేశ్ లో తొలిదశ పంచాయితీ ఎన్నికలు ముగిసాయి.. ఈ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థులు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాల్లోనే విజయం సాధించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో ఒకే ఒక్కరు విజయం సాధించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చిలుకూరు పంచాయితీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ అనే వ్యక్తి పోటీ చేశారు. త్రిముఖ పోటీలో సురేష్ విజయం సాధించడం అందరిని ఆశ్చర్యానికి గురించేంసింది. గ్రామంలో తనపై మంచి అభిప్రాయం ఉండటంతోనే పార్టీలకు అతీతంగా అతడికి ఓట్లు పడినట్లు సురేష్ తెలిపారు. ఇక మరోవైపు రెండో విడత పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండోవిడతలో 535 పంచాయితీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ ను ఎన్నుకున్నారు. ఇక మిగిలిన పంచాయితీలకు ఈ నెల 13 న ఎన్నికలు జరగనున్నాయి.

పంచాయితీ ఎన్నికల్లో బోణి కొట్టిన కాంగ్రెస్