Panchayat Elections: కొడాలికి ఎస్ఈసీ మరో ఝలక్.. కేసులు పెట్టాలని ఆదేశం!

51

ఏపీలో ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నా ఎన్నికల కమిషనర్ ప్రభుత్వం మధ్య యుద్ధం మాత్రం ఆగనేలేదు. వైసీపీ నేతలు, మంత్రులు ఎస్ఈసీ రమేష్ కుమార్ ను టార్గెట్ చేసి పరుష పదాలతో తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.. వారిపై ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. మొన్నటి వరకు మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్ఈసీపై తీవ్రంగా విరుచుపడితే అయన మైక్ కట్ చేసి అదుపు చేశారు. సజ్జల వెనక్కు తగ్గారో లేదో మంత్రి కొడాలి ఎస్ఈసీ మీద రెచ్చిపోయారు. ఏకంగా ఎన్నకల కమిషనర్ రమేష్ కుమార్ కు పిచ్చి పట్టిందని ఆసుపత్రిలో చేర్చాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కొడాలి వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఎస్ఈసీ షోకాజ్ నోటీసు జారీచేశారు. తానేం ఉద్దేశ్య పూర్వకంగా అనలేదన్న మంత్రి కొడాలి ప్రజలు అనుకుంటున్నది చెప్పానని సమాధానం ఇచ్చారు. ఒకవైపు రాజ్యాంగ సంస్థల మీద.. ఎన్నికల కమిషనర్ మీద అమితమైన గౌరం ఉందంటూనే కొడాలి షోకాజ్ నోటీసుకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. దీంతో ఈనెల 21 వరకు కొడాలి మీడియా సమావేశం నిర్వహించకూడదని ఆదేశించారు. అయితే ఇదంతా శుక్రవారం వ్యవహారం. శనివారం ఏకంగా నానిపై కేసులు బుక్ చేయాలని ఆదేశించి ఎస్ఈసీ మరో ఝలక్ ఇచ్చారు.

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు ఐపీసీ 504, 505(1)(C), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఎన్నికల కోడ్ నిబంధనల్లోని క్లాజ్‌-1, క్లాజ్‌-4 కింద కేసు నమోదు చేయాలని, ఎన్నికల నిర్వహణ, కమిషనర్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందున చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మంత్రిపైనే కేసులు బుక్ చేయాలని ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలు మరోసారి ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు ప్రభుత్వ సంస్థలు ఎస్ఈసీతో కలిసి పనిచేస్తున్నా మంత్రులు, ఎస్ఈసీలో మాత్రం ఇప్పటికీ ఆ ప్రెస్టేషన్ తగ్గలేదా అనేలా ఈ ఎపిసోడ్స్ నిరూపిస్తున్నాయి.

Panchayat Elections: కొడాలికి ఎస్ఈసీ మరో ఝలక్.. కేసులు పెట్టాలని ఆదేశం!