panchayat elections: నేటితో నామినేషన్లు బంద్!

165

panchayat elections: దేశంలో ఎక్కడా లేనంతగా ఏపీలో పంచాయతీ ఎన్నికలకు పబ్లిసిటీ వచ్చేసింది. ఇప్పటికే తొలివిడత ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుండగా నేటితో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఆదివారం సాయంత్ర 5 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు సమయం ఉండగా ఈ రోజే ఆఖరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం కనిపిస్తున్నట్లుగా ఉంది.

కాగా.. రాష్ట్రంలో ఎక్కువ శాతం స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తూ ఉండగా… పోటీపడీ అధికార పార్టీ మీద వ్యతిరేకతను బయటపెట్టాలని ఇతర పార్టీలు శ్రమిస్తున్నాయి. ఈనెల 29న సర్పంచ్‌ల కోసం 1315 మంది నామినేషన్లు, వార్డు సభ్యుల కోసం 2200 మంది నామినేషన్లు వేశారు. ఈనెల 30న సర్పంచ్‌ల కోసం 8773 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. వార్డు సభ్యుల కోసం 25519 నామినేషన్లు వేశారు. మరి చివరి రోజు ఎన్ని దాఖలవుతాయో చూడాల్సి ఉంది.