panchayat elections: నాలుగో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం!

144

panchayat elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే తొలివిడత ఎన్నికలు, ఫలితాలు కూడా వెలువడగా రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇక మూడవ విడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తవగా నాలుగో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం నుండి నాలుగో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 12వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా 16వ తేదీ వరకూ ఉపసంహరణకు గడువు, 21న పోలింగ్ జరుగునుంది. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య నామపత్రాలను రిటర్నింగ్ అధికారులు స్వీకరించనున్నారు.

నాలుగో దశలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాలకొండతోపాటు విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరిలో అమలాపురం, పశ్చిమ గోదావరిలో ఏలూరు రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరగనుండగా.. గుంటూరు, కృష్ణా జిల్లాలో నూజివీడు, ప్రకాశంలో మార్కాపురం, నెల్లూరు, కర్నూలులో ఆదోని, అనంతపురంలో పెనుకొండ, కడప జిల్లాలో జమ్మలమడుగు, కడప, చిత్తూరు జిల్లాలో తిరుపతి రెవెన్యూ డివిజన్లో, విశాఖ జిల్లా భీమునిపట్నం, పద్మనాభం, ఆనందపురం మండలాల్లో నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.

నాలుగో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం!