panchayat election: టీడీపీ మ్యానిఫెస్టో వివరాలివే..

155

టీడీపీ అధినేత చంద్రబాబు పంచాయతీ ఎన్నికల కోసం దూకుడు పెంచారు. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాకపోయినా పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు మాత్రం కాదని తెలిసిందే. అందుకే మిగతా వారికి భిన్నంగా టీడీపీ మ్యానిఫెస్టోను ప్రకటించారు. పల్లె ప్రగతి – పంచ సూత్రాల పేరిట చంద్రబాబు ఈ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ప్రజలకు సుపరిపాలన అందించే లక్ష్యంతోనే మేనిఫెస్టోను రూపొందించినట్టు చెప్పారు. గ్రామాల్లో సమర్థవంతమైన పాలన కోసమే ఈ ప్రయత్నమని చెప్పారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న వివరాలివే..

ఉచిత కుళాయిలతో రక్షిత మంచినీరు,
భద్రత – ప్రశాంతతకు భరోసా కల్పిస్తాం
ఆలయాలపై దాడులు అరికట్టి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తాం
స్వచ్ఛత, పరిశుభ్రతతో ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దుతాం
ఆస్తి పన్ను తగ్గించి పౌర సేవలు మెరుగు..
పై ఐదు సూత్రాలతో పాటు స్వయం సంవృద్ధి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మోటర్లకు మీటర్లను అడ్డుకోవడం
ప్రభుత్వ పథకాలతో.. ప్రభుత్వం అందించే కోవిడ్ వ్యాక్సిన్ అందరికీ అందేలా చర్యలు వంటి ప్రాధమిక అంశాలతో టీడీపీ పంచాయతీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది.