Panchayat election : సర్పంచి అభ్యర్థి కిడ్నాప్

224

Panchayat election : ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు అక్కడక్కడా గొడవలకు దిగుతున్నారు. నామినేషన్ల విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలు టీడీపీ నేతలను నామినేషన్లు దాఖలు చెయ్యనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబందించిన కొన్ని ఆడియో టేపులు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లా చిన్న గంజాం మండలం పెద్దగంజాం సర్పంచి అభ్యర్థిని వైసీపీ నేతలు కిడ్నాప్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

టీడీపీ నేత తిరుపతిరావును అధికార వైసీపీ నేతలు కారులో ఎత్తుకెళ్లారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ మేరకు చిన్న గంజాం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నామినేషన్ వెయ్యడానికి వెళ్లిన తిరుపతిరావును కారులో తీసుకోని వెళ్లినట్లుగా చెబుతున్నారు. నామినేషన్ వెయ్యవద్దంటూ టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లుగా తిరుపతిరావు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తిరుపతిరావు కోసం గాలింపు చేపట్టారు.

Panchayat election : సర్పంచి అభ్యర్థి కిడ్నాప్